Header Banner

148 కిలోల గంజాయి స్వాధీనం! గంజాయి రవాణా, రౌడీయిజం పై పోలీసుల కఠిన నిఘా!

  Thu Feb 20, 2025 15:08        Others

గంజాయి రవాణాదారులు.. ఆకతాయిలు, రౌడీషీటర్లు.. ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగేవారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు వారిపై చర్యలు తీసుకుంటూ, కేసులు పెడుతున్నారు.

గంజాయి రవాణాదారులు.. ఆకతాయిలు, రౌడీషీటర్లు.. ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగేవారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు వారిపై చర్యలు తీసుకుంటూ, కేసులు పెడుతున్నారు. ఇలా గత 25 రోజుల వ్యవధిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసి 148 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 225 మంది రౌడీషీటర్లను ఆయా పోలీసు స్టేషనకుఉ పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

 

మళ్లీ గలాటాలు, ఘర్షణలకు పాల్పడితే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్పీ హర్షవర్ధనరాజు హెచ్చరించారు. ఇక తిరుపతిలో పాటు చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరు(Chandragiri, Satyavedu, Srikalahasti, Naidupeta, Gudur), పాకాల.. ఇలా పలుచోట్ల శివార్లలో బహిరంగంగా మద్యంతాగే ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. అక్కడ పొదలు, చెట్లు ఉంటే శుభ్రం చేశారు. ఇలాంటి చోట్ల మద్యం తాగితే చర్యలు చేపడతామని హెచ్చరించారు. కాగా, పదే పదే బహిరంగంగా మద్యంతాగుతూ పట్టుబడిన 2378 మందిపై కేసులు నమోదు చేశారు.

372 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న 1597 మంది చిరు వ్యాపారులపై న్యూసెన్సు యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది 1686 సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడి చట్టాలపై అవగాహన కల్పించారన్నారు. చట్టాలను అతిక్రమించి ప్రవర్తించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 
 
 


   #andhrapradesh #andhrapravasi #police #rowdyism #ganja